'డియర్ కామ్రేడ్' హిందీ వెర్షన్ .. 2 వారాల్లో 6 కోట్లకి పైగా వ్యూస్

  • తెలుగులో ఆదరణ పొందని 'డియర్ కామ్రేడ్'
  • విజయ్ దేవరకొండకి తగ్గని క్రేజ్ 
  • ఇతర భాషా ప్రాంతాల్లోను అభిమానులు
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' రూపొందింది. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగులో ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేకపోయింది. కాకపోతే కొన్ని చోట్ల జాగ్రత్తలు తీసుకుని ఉంటే, ఈ సినిమా హిట్ కొట్టేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాంటి ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ ను 2 వారాల క్రితం యూట్యూబ్ లో పెట్టారు.

2 వారాల్లోనే ఈ సినిమా 6 కోట్లకి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం. 'అర్జున్ రెడ్డి' సినిమా నుంచే విజయ్ దేవరకొండకి ఇతర భాషల్లోను అభిమానులు పెరుగుతూ వస్తున్నారు.'అర్జున్ రెడ్డి' సినిమాను హిందీలో రీమేక్ చేసే సమయంలోను ఒరిజినల్ చూసి, విజయ్ దేవరకొండకి అభిమానులుగా మారిపోయారు. ఈ కారణంగానే తెలుగులో అంతగా సక్సెస్ ను సాధించని 'డియర్ కామ్రేడ్' .. హిందీ డబ్బింగ్ వెర్షన్లో యూ ట్యూబ్ లో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
Go Back to Shorts
Vijay Devarakonda
Rashmika Mandanna
Dear Comrade Movie

More Telugu News